’18 పేజెస్‌’ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

 ’18 పేజెస్‌’ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

భూమిపుత్ర,సినిమా:

యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న ’18 పేజెస్‌’ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. జూన్‌ 1 నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌ డే విషెస్‌ తెలుపుతు తాజాగా పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో సిద్ధు పాత్రలో నిఖిల్‌ సిద్దార్థ్‌.. నందిని పాత్రలో అనుపమ నటిస్తున్నట్లు తెలిపారు. నిఖిల్‌ కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఓ కాగితాన్ని ఉంచి.. దానిపై అనుపమ పరమేశ్వరన్‌ పెన్నుతో రాస్తున్నట్లు డిజైన్‌ చేసినన ’18 పేజెస్‌’ ఫస్ట్‌ లుక్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. టైటిల్‌తో పాటు తాజాగా వదిలిన పోస్టర్‌తో సినిమా విూద అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్‌ స్టోరీ, స్క్రీన్‌ ప్లే అందిస్తుండగా అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *