15 రోజులపాటు ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

 15 రోజులపాటు ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

నేడు శాస్త్రోక్తముగా జరిగిన ధ్వజారోహణం

భూమిపుత్ర, అనంతపురం: 22.03.2021 నుండి 05.04.2021 వరకు అంగరంగ వైభవంగా జరిగే శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు  ధ్వజారోహణ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆయన మాటలలో కృతయుగం నుండి భక్తుల పాలిట కొంగు బంగారము, ఆశ్రీత కల్పవృక్షం అయిన, శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి, అతి పవిత్రమైన,అద్భుతమైన బ్రహ్మోత్సవాలు లో ధ్వజారోహన కార్యక్రమంతో,సమస్తమైన భక్తులకు అందరికి,అకండమైన పుణ్యఫలంతో ఆనందాన్ని భోగాన్ని,ప్రసాదిస్తూ లోకకల్యాణం కోసం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని సకల దేవతలకు,యక్షులు,కిన్నారులు,గంధర్వులు, మహర్షులు, పితృదేవతలు, చరాచర సృష్టికి నిలయం అయిన ముల్లోకములకు గరుత్మంతుడు ధ్వజారూఢుడై శుభారంభాన్ని సూచిస్తూ స్వాగతం  పలుకుతూ ఆహ్వానము తెలియజేసే, వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహించే వైదిక ప్రక్రియ ఈ ధ్వజారోహణం అని అన్నారు.
జగత్తుకు తెలియజేసే ఆహ్వానం అయినటువంటి వైదిక ప్రక్రియగా దీన్ని నిర్వహిస్తున్నారని తెలియ చశారు. దేవాలయానికి ధ్వజస్తంభం ప్రాణం వంటిది అటువంటి ప్రాణప్రదమైన జీవస్థానము అయినటువంటి ధ్వజ స్థంభం అగ్రభాగాన గరుత్మంతుని రూపాన్ని చిత్రీకరించిన పసుపు పచ్చని వస్త్రాన్ని చక్కని పుష్పమాలలతో అలంకరించి చేసి వైదిక మంత్రాలతో ఆవాహనాది క్రియా కలాపాలని చేసి పవిత్రమైన తాడుతో ధ్వజస్తంభం పైకి దానిని లాగి ఇటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే ధ్వజారోహణం. స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమయినటువంటి గరుత్మంతుని పటం మీద చక్కగా చిత్రీకరించి స్వామి వారి యొక్క వైభవాన్ని చాటి చెప్పటానికి ఒక వార్తాహరునిగా ఈరోజు గరుత్మంతుడు ప్రకాశిస్తున్నాడని అన్నారు.ధ్వజస్తంభం పై ఉన్న మూడు మేఖళాలు మనలో వుండే సత్వ,రజ, స్తమో గుణాలకు ప్రతీక ,పాతాళ, భూ,స్వర్గ లోకాలకు ప్రతీక వీటికి ఆధారంగా వుండే స్తంభం ధర్మానికి ప్రతీక, ఈవిదంగా ధర్మం మీద మూడు లోకాలు,మూడు గుణాలు ఆధారపడి ఉన్నాయి,ఆ యొక్క ధర్మానికి ప్రతీక, ఆధారం భగవంతుడే అని చాటిచెప్పే ధ్వజస్తంభం పై అలోభుడై(లాభం లేని వాడు) దేదీప్యమానంగా దర్శనమిస్తూ గరుత్మంతుడు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతున్నారని పేర్కొన్నారు.
ఉదయం ప్రదానాచార్యులు  ప్రధాన కుంభ ఆరాధన,వాస్తు పూజ,గరుడాన్గాహోమం, శ్రీవారి కి విశేష ఆరాధన ,పంచ గవ్వ ప్రాశన, బ్రహ్మోత్సవ కంకణ ధారణ,మృదంగా భేరి తదానం, అష్టదిక్పాలక బలి నిర్వాపనం, తిరువీధుల్లో గరుడ పట ఉత్సవం,మంతపోత్సవం అనంతరం ధ్వజస్తంభ నివాసితుడైన,మహా సర్పాన్తకుడైన కాపీలక్షుడికి(గరుత్మంతుడు) విశేష స్నపనం,ఆరాధన,గరుడ బలి,ముద్గా అన్న నివేదన, గరుడ తాల,గద్య, సూక్త,అక్షతా రోపణములుతో,ప్రబంధ పరాయణములతో, అత్యంత వైభవోపేతంగా అర్చకులు నిర్వహించారు.
గారుడో వేదమూర్తిస్తూ తప్త హాఠక సన్నిబహా,సుకపించాం బరదరో జల్లరీ మెగలైర్యుతః
అని ప్రార్థిస్తూ ఎవరైతే ఈ ధ్వజారోహన కార్యక్రమంలో పాల్గొంటారో వారికి సర్పదోషములు భాదించవని,ధర్మ విజయములు పొందగలరని, ఆగమ శాస్త్రం చెపుతుంది.గర్భ సంబంద దోషములు గాని,సంతానము లేని వారు ఈ గరుడ ప్రీతికర ముద్గన్నా ప్రసాదాన్ని సేవించి నంతనే,దోషములు పోయి, సత్ సంతానములు కలుగునని ఆగమశాస్త్ర తెలుపుతోందన్నారు. మంత్రి శంకరనారాయణ,స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *