చౌక దుకాణాల రేషనలైజేషన్ పూర్తి చేయండి

 చౌక దుకాణాల రేషనలైజేషన్  పూర్తి చేయండి
భూమిపుత్ర, తిరుపతి :   రేషన్ కార్డులు, చౌక దుకాణాల  రేషనలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, అప్పుడే  లబ్దిదారులకు రేషన్ త్వరగా  అందించగలమని  తిరుపతి ఆర్ డి ఓ కనకనరసారెడ్డి అన్నారు.
సోమవారం ఉదయం స్థానిక ఆర్ డి ఓ కార్యాలయం లో  రేషన్ డీలర్లు, తహసీల్దార్లతో   రేషనలైజేషన్ ప్రక్రియపై  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆర్ డి ఓ మాట్లాడుతూ  రేషన్ కార్డుల లబ్దిదారులకు  అందుబాటులో వుండేలా  రేషన్ షాపుల  అనుసంధానం  కావాలని సూచించారు.  ఒక్కో రేషన్ డీలర్ వద్ద 2 వేల కార్డులు మించరాదని,  ఎక్కువ వున్న వాటిని  దగ్గరలోని రేషన్  షాపు అనుసంధానం  చేయాలని సూచించారు.  రేషనలైజేషన్ విషయం లో డీలర్లు సహకరించాలని సూచించారు. నిత్యావసర సరుకులు త్వరగా అందించాలని కలెక్టర్ గారు సూచించారని, క్షేత్ర స్థాయిలో  వి ఆర్ ఓ లకు సహకరించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ సమీక్ష లో   తహసీల్దారులు తిరుపతి అర్బన్ జయరాములు, రూరల్ భాగ్యలక్ష్మి,  రేణిగుంట దస్తగిరయ్య,   సహాయ పౌర సరఫరాల అధికారిణి ఝాన్సీరాణి ,  డి టి   చంద్రిక, అధికారులు పాల్గొన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *