కోటి రూపాయల విరాళమందించిన ఒంగోలు ఎంపీ

 కోటి రూపాయల విరాళమందించిన ఒంగోలు ఎంపీ

భూమిపుత్ర,చెన్నై:

కోవిడ్‌ మహమ్మారి ఉపద్రవంతో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యకు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసురెడ్డి మద్దతు పలికారు. అంతేగాక కొవిడ్‌ నివారణ చర్యలకు రూ.కోటి విరాళం అందజేశారు. ఈ మేరకు మాగుంట శ్రీనివాసురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, మేనల్లుడు ఎస్‌డీ రామిరెడ్డి ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి చెక్కు అందించగా, స్టాలిన్‌ వారిని అభినందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కొవిడ్‌ మహమ్మారిని పారద్రోలి విజయం సాధించడానికి అందరూ సమష్టిగా కృషి చేయాని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఎంకే యువనేత ఉదయనిధి కూడా పాల్గొన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *